గద్వాల: మల్దకల్ జాతరకు బస్సులు లేక భక్తుల అవస్థలు.!

1447చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ లోని శ్రీస్వయంభు లక్ష్మీవెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా భక్తులు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపకపోవడంతో వేలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండటంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వెంటనే అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ప్రజలు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్