జోగులాంబ గద్వాల జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులకు రుణమాఫీ చేయాలని, రైతు భీమా ప్రీమియం చెల్లించాలని, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని
బీజేపీ నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. అయిజ మండలంలోని ఎక్లాస్పురం, దేవ బండ, బింగి దొడ్డి గ్రామాల్లోని పొలాలను పరిశీలించిన అనంతరం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్ర రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు నెలలుగా వర్షాలు లేక పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని వారు కోరారు.