జోగులాంబ గద్వాల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం చెనుగోనుపల్లి, అనంతపురం, బసల్ చెరువు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన, లారీలు తక్కువగా ఉండటం వల్ల కొనుగోలు ఆలస్యమవుతోందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని గమనించారు. వెంటనే అదనపు లారీలు ఏర్పాటు చేసి, ప్రతి కేంద్రం నుంచి రోజుకు కనీసం నాలుగు లారీలలో ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు.