రాబోయే 2-3 గంటల్లో మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.