జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి రేడియాలజీ హబ్ ప్రాంతంలో పిచ్చి కుక్కలు తిరుగుతుండటంతో రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యం కోసం వచ్చే రోగులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కుక్కల మధ్యలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, పిచ్చి కుక్కలను వెంటనే తొలగించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.