జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప) స్వామిని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శనివారం పార్టీ కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎంపీకి శ్వేత వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చరిత్రను వర్ణించినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. నడిగడ్డ ప్రజలు సుభిక్షంగా ఉండి వృద్ధి సాధించాలని ఎంపీ కోరుకున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.