జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, బుధవారం ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా సేఫ్ మదర్ హుడ్ (సురక్షిత మాతృత్వం)పై వైద్యులు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరం కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రతి ఆసుపత్రిలో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.