దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఎయిర్ పోర్ట్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో అమృత్ స్టేషన్ పథకం కింద నిధులు మంజూరయ్యాయని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ను పరిశీలించిన ఆమె, రూ.13 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, పూర్తయితే వచ్చే నెల 10న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.