గద్వాల: దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

789చూసినవారు
గద్వాల: దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్
జోగులాంబ గద్వాల జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రకటించారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఐడీఓసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంబంధిత అధికారులు నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తారని తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్