జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో దద్దరిల్లింది. తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో గద్వాల పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఈ తేలికపాటి వర్షం కొంత మేరకు ఉపశమనం కలిగించింది.