జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం తమ వర్గానికి 7 బీఫారాలు కేటాయించినా, డీసీసీ అధ్యక్షుడు బీఫారం విషయంలో మోసం చేశారని ఆమె ఆరోపించారు. సరైన సమయంలో బీఫారాలు అందకపోవడంతో అభ్యర్థుల నామినేషన్లు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఇండిపెండెంట్లుగా పోటీ చేయాల్సి వచ్చిందని సరిత తెలిపారు.