జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో శనివారం రాత్రి డీఎస్పీ మొగిలయ్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 50 మంది పోలీసులు పాల్గొని, అనుమానితుల వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.