జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఎల్కూర్ గ్రామంలో సోమవారం జరిగిన ఏరువాక ఉత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డీలర్ తిప్పన్న నాయుడు ఊహించని రీతిలో వెనుక నుంచి వచ్చిన ఎద్దు తగలడంతో స్వల్ప గాయాలపాలయ్యారు. రైతులు పరిగెత్తిస్తున్న ఎద్దులు తగలడంతో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులంతా దిగ్భ్రాంతి చెంది, బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు.