గద్వాల: జిల్లా కేంద్రంలో డ్రగ్స్ కలకలం!

1చూసినవారు
గద్వాల: జిల్లా కేంద్రంలో డ్రగ్స్ కలకలం!
జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలో ఎన్టీపీఎస్ చట్టం కింద యూరిన్ పరీక్షలు నిర్వహించారు. సీఐ టంగుటూరి శ్రీను పర్యవేక్షణలో, ఎస్ఐ కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో అనుమానితులను పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రగ్స్ వినియోగ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షల్లో ఓ వ్యక్తికి మాదకద్రవ్యాల వినియోగం నిర్ధారణ కావడంతో అతనిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని సీఐ శ్రీను తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్