జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని సిరి ట్రేడర్స్ ఎలక్ట్రికల్ దుకాణంలో ఈ నెల 8న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ. 53 వేల నగదు దోచుకెళ్లిన ఘటనలో పోలీసులు కేసును ఛేదించారు. కర్నూల్ జిల్లాకు చెందిన వంశీ, వెంకటేశ్ అనే ఇద్దరు నిందితులను తాటికుంట స్టేజ్ వద్ద శుక్రవారం మల్దకల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 40,500 నగదు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీహరి తెలిపారు. ఈ ఘటనలో దొంగతనం జరిగిన విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.