ప్రైవేటు కళాశాలల్లో పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ, బుధవారం జోగులాంబ గద్వాల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు, జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్యను పోలీసులు డీఎస్పీ కార్యాలయం సమీపంలో ముందస్తు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించాలని కోరుతుంటే
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని విమర్శించారు.