జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ హాస్టల్ లో శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత 54 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వీరిని గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై కలెక్టర్ బీఎం సంతోష్ సీరియస్ అయ్యారు. విచారణ అనంతరం వార్డెన్ జయరాములుపై శనివారం సస్పెన్షన్ వేటు వేశారు.