అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన భర్తకు జిల్లా జడ్జి ప్రేమలత ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. అలంపూర్ మండలం సింగవరానికి చెందిన చాకలి హరికృష్ణకు, కర్నూల్ జిల్లాకు చెందిన జూపల్లి మల్లికకు 2022లో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం వేధింపులు తట్టుకోలేక మల్లిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కర్నూల్లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో భర్త హరికృష్ణ దోషిగా తేలడంతో శిక్ష విధించారు.