గద్వాల: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

1305చూసినవారు
గద్వాల: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
జోగులాంబ గద్వాల జిల్లా ఎక్సైజ్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు, సోమవారం చిన్నచింతరేవుల ఎక్స్ రోడ్డు వద్ద గద్వాల ఎక్సైజ్ అధికారులు వనపర్తి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన అవీజ్ అనే వ్యక్తిని 150 గ్రాముల గంజాయితో పట్టుకున్నారు. అతను గంజాయిని బైక్ పై గద్వాలలో అమ్మడానికి తీసుకువస్తుండగా అధికారులు పట్టుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.