జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఉప్మా తిన్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. అయితే, ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని వార్డెన్ పవన్ కుమార్ తెలిపారు. ఉప్మాలో చీమలు, పురుగులు ఉన్నాయని విద్యార్థులు చెప్పడంతో వెంటనే దానిని ఆపి, వారికి బిస్కెట్లు, అరటి పండ్లు అందించారు. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.