జోగులాంబ గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డుల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల భారీ మద్దతు ర్యాలీలో పాల్గొన్న ఆయన, పట్టణాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, 37 మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి తనకు సహకరించాలని కోరారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.