జోగులాంబ గద్వాల జిల్లా మర్లపల్లి జిల్లెడు బండ గ్రామంలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా గోకుల కృష్ణ జంట కోలాట బృందం, ధరూర్ గ్రామ చిన్నారులు కోలాటం భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నాగేష్ నాయుడు, ఐజ మండలం దేవబండ కోలాటం మాస్టర్ బీ పరమేష్‌ను శాలువ, పూలమాలలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని గ్రామస్తులు కోరారు.