ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు అస్వస్థత: 30 మందికి ఆసుపత్రిలో చికిత్స

309చూసినవారు
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు అస్వస్థత: 30 మందికి ఆసుపత్రిలో చికిత్స
ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 30 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, విషాహారంతో విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 90 మంది విద్యార్థులు ఇలాగే మరణించారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్