ప్రస్తుతం రసాయనాలతో తయారయ్యే సబ్బులు, పేస్టుల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ఆయుర్వేద ఉత్పత్తులు ఆరోగ్య రక్షణకు తోడ్పడతాయని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఐఎంసీ మెగా ఆయుర్వేద కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆయుర్వేదం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జంబు రామన్ గౌడ్, శంకర్, శ్రీధర్ గౌడ్, విజయ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.