ఇటిక్యాల మండలం తిమ్మాపురం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గోకుల కృష్ణ జంట కోలాటం బృందం, ధరూర్ గ్రామ చిన్నారులు అద్భుతమైన కోలాటం ప్రదర్శనను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కల్పన, శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐజ మండలం దేవ బండ కోలాటం మాస్టర్ బి పరమేష్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.