అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు న్యాయవాదుల పాదయాత్ర

4చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలన్న డిమాండ్ తో అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభమైంది. న్యాయవాదుల బృందం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాల వద్ద పూజలు నిర్వహించి పాదయాత్రను మొదలుపెట్టింది. ఈ పాదయాత్ర వారం రోజుల పాటు కొనసాగి, హైదరాబాద్ చేరుకుని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జిలకు తమ సమస్యలు, డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాలు అందజేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్