గద్వాల జిల్లాలో పందుల చోరీ కలకలం!

0చూసినవారు
గద్వాల జిల్లాలో పందుల చోరీ కలకలం!
గద్వాల జిల్లాలో రాత్రి వేళల్లో పందుల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పందులను ఎత్తుకెళ్తుండగా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సీసాలు, రాళ్లతో దాడి చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దొంగతనాలను అరికట్టేందుకు ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్