బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

520చూసినవారు
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీటీ పాడు సర్పంచ్ మహేశ్వరి సుధాకర్ గౌడ్ అన్నారు. స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో నిర్వహించిన బాలల హక్కులు, సమస్యలపై అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ భవిష్యత్తు అయిన పిల్లలు విద్య, ఆరోగ్యం, భద్రత వంటి మౌలిక హక్కులను పూర్తిగా పొందేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, పిల్లలపై వేధింపులు వంటి సమస్యలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్