గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది. జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించబడుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.