గద్వాల జిల్లాలో వర్షం... రైతన్నల హర్షం!

763చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం కొత్త చిన్నోనిపల్లిలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చాలా రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వాన ఎంతో ఊరటనిచ్చింది. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు లేక ఆందోళనలో ఉన్న అన్నదాతలకు, ఈ వర్షం కొత్త ఆశలను, సంతోషాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్