పెబ్బేరు సమీపంలో వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సోమవారం ఆదేశించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించారు. స్థానికులు ఎమ్మెల్యే విజయుడి స్పందనపై అభినందనలు తెలిపారు.