గద్వాల్ జిల్లాలో రోడెక్కిన ఇసుక పంచాయతీ

1చూసినవారు
గద్వాల్ జిల్లాలో రోడెక్కిన ఇసుక పంచాయతీ
గద్వాల్ జిల్లా రాజోలి మండలంలో ఆదివారం ఉదయం గాంధీచౌక్ వద్ద దాదాపు 60-80 ఎడ్లబండ్ల కార్మికులు ధర్నాకు దిగారు. నదిలోకి ఇసుక కోసం వెళ్తున్న ఎడ్లబండ్లను పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తమైంది. రాత్రిపూట ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే, తాము ఉదయం వెళ్తే తప్పేంటని కార్మికులు ప్రశ్నించారు. ఎస్సై గోకారి మాట్లాడుతూ, అధిక ధరలకు ఇసుక డంపింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయని, సమస్యలుంటే పోలీస్ స్టేషన్ కు రావాలని, రోడ్లపై ధర్నాలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్