రేషన్ షాప్ కోసం సోంపురం గ్రామ ప్రజల ఆందోళన

325చూసినవారు
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని దరూర్ మండలం సోంపురం గ్రామ ప్రజలు రేషన్ షాప్ కోసం గత 40 సంవత్సరాలుగా రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. గ్రామంలో 250 కార్డులు ఉన్నందున, సోంపురం గ్రామానికి చౌకధర దుకాణం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.