అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

0చూసినవారు
అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
జిల్లా కేంద్రమైన గద్వాల సమీపంలోని జములమ్మ అమ్మవారికి మంగళవారం ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. మంగళవారం ఆమెకు ప్రీతి పాత్రమైన రోజు కావడంతో తెల్లవారుజామునే మూల విగ్రహానికి కృష్ణా నది జలాలతో అభిషేకం చేశారు. అనంతరం వస్త్రాలంకరణ, నైవేద్య విస్తరణ తదితర పూజా కార్యక్రమాలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

సంబంధిత పోస్ట్