గద్వాల మున్సిపాలిటీలో అవినీతిపై కఠిన చర్యలు: చైర్‌పర్సన్

0చూసినవారు
గద్వాల మున్సిపాలిటీలో అవినీతిపై కఠిన చర్యలు: చైర్‌పర్సన్
గద్వాల మున్సిపాలిటీలో అవినీతికి తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి తెలిపారు. మున్సిపల్ షాపుల అద్దె వసూళ్లు, నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో ఆమె బుధవారం స్పందించారు. అవినీతికి పాల్పడే అధికారులు, ఉద్యోగులు ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదని, మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్