జోగులాంబ గద్వాల జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల వద్ద వేకువజాము నుంచే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తిక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. ఆలయ పరిసరాలలో భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ అర్చనలు నిర్వహిస్తున్నారు.