అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, గద్వాల్‌లోని మెడికొండ పాఠశాలలో అంతర్‌తరాల అనుబంధం, అభ్యాస దినోత్సవం కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ తెల్లమ్మ మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం భారతీయ సంస్కృతికి ప్రతీక అని, వారి జీవిత అనుభవాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. నేటి తరం
విద్యార్థులు వృద్ధుల అనుభవాలను తెలుసుకుని జీవితంలో విలువలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పి. తిమ్మారెడ్డి, ఉపాధ్యాయులు డి. చిన్న తిమ్మప్ప, నర్సింహులు, అనుపమ తదితరులు పాల్గొన్నారు.