సమాజ నిర్మాణంలో అంగన్వాడీ టీచర్ల బాధ్యత ఎంతో కీలకమని
బీజేపీ ఎర్రవల్లి మండల అధ్యక్షుడు జగదీశ్ రెడ్డి అన్నారు. వేముల గ్రామంలో " సేవా సంకల్ప్ అభియాన్"లో భాగంగా సోమవారం నిర్వహించిన అంగన్ కే ఉత్సవ్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లను సన్మానించి, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పలు సేవలు అందిస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం వాటి సేవలను మరింత విస్తృతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మహేష్, కార్యదర్శి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.