జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మున్సిపాలిటీకి చెందిన దుకాణాల అద్దె సొమ్మును వసూలు చేసి, వ్యక్తిగత అవసరాలకు వినియోగించిన వ్యవహారంలో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మంగళవారం సస్పెండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి ఈ మొత్తాన్ని మున్సిపాలిటీ ఖాతాలో జమ చేయకుండా దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో మున్సిపల్ ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజవర్ధన్, జూనియర్ అసిస్టెంట్ షరాఫ్ లను సస్పెండ్ చేశారు.