అయిజ మండలం ఉత్తనూర్ గ్రామంలో మంగళవారం వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి జిల్లా ఏపీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గ్రామంలోని నివాస ప్రాంతాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రహదారులు, నీటి వనరులు, సాగు భూములు, పారిశుద్ధ్య సదుపాయాల వివరాలను మ్యాప్‌లో పొందుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దగ్గుపాటి రాణి, కార్యదర్శి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.