ఎర్రవల్లి మండలం కోదండాపూర్ శివారులోని NH-44పై ఆదివారం తెల్లవారుజామున కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు ముందున్న లారీని ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.