అయిజ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో గడ్డం కృష్ణయ్యను మంగళవారం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడే సాబ్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి, ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఆయనకు శాలువా,పూలమాలతో ఘనంగా సన్మానించిన అనంతరం మండల ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని కోరారు.