
మహబూబ్ నగర్: అందేశ్రీ పాడే మోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ పార్థివ దేహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. మంగళవారం అందెశ్రీ అంతిమయాత్రలో పాల్గొన్న సీఎం, ఆయన పాడెను కూడా మోశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, అందెశ్రీతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.





































