మిడ్జిల్ మండలంలో శనివారం సిఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో జోన్–7 జోగులాంబ డీఐజీ ఎల్. ఎస్. చౌహాన్ శుక్రవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకితో కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ట్రాఫిక్ నియంత్రణ మరియు ఇతర బందోబస్తు ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. పర్యటన విజయవంతం కావడానికి పోలీసులు అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.