అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. జడ్చర్ల పట్టణ కేంద్రంలోని సిగ్నల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తా సమీపంలో బొగ్గు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ప్రమాదం నుండి డ్రైవర్ బయటపడ్డాడు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.