మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ లో రికార్డు స్థాయిలో 14, 630 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధానన్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. యాక్సిడెంట్ కోసం కక్షిదారులు దాఖలు చేసిన కేసు నంబర్ 393/2021లో నష్ట పరిహారం రూ.35 లక్షలకు, ప్రతివాది చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి మధ్య రూ.20 లక్షలకు, 2018లో భూమి వివాదం కేసులను సీనియర్ సివిల్ కోర్టు రాజీ మార్గంలో పరిష్కరించారని జడ్జి తెలిపారు.