
ఉదండాపూర్ భూ నిర్వాసితులకు త్వరలోనే శుభవార్త: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ కి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం తెలిపారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, భూ నిర్వాసితులకు ఇది శుభవార్త అని ఆయన పేర్కొన్నారు.




































