
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది: ఫోన్ తిరిగి అప్పగింత
నారాయణపేట నుండి జడ్చర్లకు వచ్చిన నేహా అనే ప్రయాణికురాలు టిఫిన్ కోసం బస్సు దిగి, ఆటోలో ప్రయాణిస్తుండగా తన ఫోన్ ను మర్చిపోయింది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ రవీంద్రనాథ్, ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నరసింహులు ఆటోలో ఉన్న ఫోన్ను గుర్తించి, వెంటనే ప్రయాణికురాలు నేహాకు తిరిగి అప్పగించారు. వారి నిజాయితీని స్థానికులు అభినందించారు.


































