
మహబూబ్ నగర్: నిషేదిత అల్ట్రా జోలం పట్టివేత
జడ్చర్ల: ఇటీవల కాలంలో గంజాయి, అల్ట్రా జోలం వంటి నిషేధిత పదార్థాల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో, జడ్చర్ల ఎక్సైజ్ అధికారులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 240 గ్రాముల అల్ట్రా జోలం, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నక్కల బండ తండా వద్ద తనిఖీలు నిర్వహించగా, కొండియా నాయక్ అనే వ్యక్తి వద్ద 240 గ్రాముల అల్ట్రా జోలం లభించింది. విచారణలో, అతనికి సరఫరా చేస్తున్న హైదరాబాద్‌లోని మౌలాలికి చెందిన రాంసాగర్, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 85 గ్రాముల అల్ట్రా జోలం, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురూ అల్ట్రా జోలంను గ్రాముకు వెయ్యి రూపాయల చొప్పున మహబూబ్ నగర్ పరిధిలోని వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా, ముగ్గురికి రిమాండ్ విధించారు. నిషేధిత పదార్థాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి హెచ్చరించారు.







































