
కల్వకుర్తిలో కోలోరే కోలో కొట్టం కోలే
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ, బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో 'కోలోరే కోలో కొట్టం కోలే' కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో బీసీ ఐక్యవేదిక నాయకులు రాజేందర్, సదానందం గౌడు, గోపాల్, భగత్ సింగ్, రాహుల్ తదితరులు పాల్గొని 'జై బీసీ, జై జై బీసీ' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం దీపావళి పండుగ సందర్భంగా జరిగింది.



































